11-10-2025 12:49:22 PM
కేంద్రం లేఖపై సీఎం ఎందుకు స్పందించట్లేదో చెప్పాలి
హైదరాబాద్: నీళ్లు తరలించుకుపోతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించట్లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. సీఎం ప్రజా ప్రయోజనాలు కాపాడతావా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటావా? అని ప్రశ్నించారు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని హరీశ్ రావు స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసింది. కేంద్రం లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ పాలిట బనకచర్ల పెనుప్రమాదంగా మారుతోందని హరీశ్ రావు హెచ్చరించారు. బనకచర్ల అంశంలో బీఆర్ఎస్ హెచ్చరికలు నిజం అవుతాయని తెలిపారు. కేంద్ర అండతో నిబంధనలు తుంగలోలొక్కి ఏపీ ప్రభుత్వం బనకచర్లపై ముందుకెళ్తుందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి బనకచర్లను అడ్డుకోకపోగా.. పరోక్షంగా సహకరిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. బనకచర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా సీఎం స్పందించలేదని విమర్శించారు. బనకచర్ల డీపీఆర్ ను పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి లేఖ రాశారు. కేంద్రం రాసిన లేఖపై రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదన్న ఆయన ప్రభుత్వానికి చేతకాకపోతే ప్రజల తరఫున బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళుతుందని పేర్కొన్నారు.