calender_icon.png 11 October, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే బనకచర్లపై జీవోలు

11-10-2025 02:00:01 PM

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నాం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తాం

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై(BC reservations) సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud ) తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మషేశ్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజీపడే ప్రస్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే బనకచర్లపై(Banakacherla) జీవోలు వచ్చాయని వివరించారు. రాయలసీమను రతనాలసీమ  చేస్తానన్నది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ తో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకొని విందులు చేసుకున్నారని వెల్లడించారు. ప్రజల హక్కుల విషయంలో కేసీఆర్ మౌనం వహిచారని మండిపడ్డారు. ఒక్క చుక్క నీటిని వదులుకోమని టీపీసీసీ అధ్యక్షుడు తేల్చిచెప్పారు.