11-10-2025 12:08:48 PM
ఇసుక కాంట్రాక్టర్ పై డీఎస్పీకి ఫిర్యాదు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్(Manuguru Police Station)లో సీఐ నాగబాబు సమక్షంలో ఇసుక కాంట్రాక్టర్ గంటా రమేష్ తనపై పిడుగులు గుద్ది రక్తస్రావం వచ్చే విధంగా గాయపరిచారని మణుగూరు మండలం(Manuguru Mandal) కమలాపురం గ్రామానికి చెందిన మునిగిల నాగేశ్వరరావు శుక్రవారం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ... కమలాపురం గ్రామానికి చెందిన తాను తన అవసరాల రీత్యా సమితి సింగారంలో నివాసం ఉంటున్నాను. తన వ్యవసాయ భూమి కమలాపురం ప్రాంతంలో ఉన్నందున వాటి బాగోగుల కోసం కమలాపురం వెళ్లి వస్తుంటాను. ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీన సాయంత్రం 6.30 గంటల సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం కమలాపురం గ్రామం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇసుక లారీలు అతివేగంతో తన పైకి దూసుకు రావడంతో అప్రమత్తమై తప్పుకోవడం జరిగింది. అతివేకంగా ప్రయాణిస్తున్న ఇసుక లారీల ను నియంత్రించాలని తనకు జరిగిన ప్రాణాపాయాన్ని వివరిస్తూ ఇసుక ర్యాంపు బినామీగా ఉన్న గంట రమేష్ కు ఫోన్ ద్వారా ఇస్కరంపు నడిపే విధానం ఇదేనా, లారీల వేగం నియంత్రణ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తారా అంటూ కోపంగా మాట్లాడటం జరిగింది.
దానికి సమాధానం గా ఆయన తనను ఇష్టానుసారమైన పదజాలంతో దూషించారు. ఆ తర్వాత మణుగూరు సీఐ నాగబాబు తనను స్టేషన్ కు రమ్మని ఆదేశించారు. తాను సీఐ దగ్గరికి వెళ్లే లోపే గంట రమేష్ సిఐ రూములో ఉన్నాడని, రమేష్ ను తిట్టావని ఫిర్యాదు చేశారని సిఐ తెలిపారు. కేసు నమోదు చేయాలంటూ అడిగారు. తాను ఏ వ్యక్తిని ఉద్దేశించి తిట్టిన సందర్భం లేదని, ఇసుక ర్యాంపు నుంచి నడుస్తున్న లారీలు అతివేగంగా ప్రయాణిస్తున్నాయని, వాటిని నియంత్రించాలని తనపై లారీలు దూసుకు రావడంతో గంట రమేష్ కు వివరించి తన ఆవేదన వ్యక్తపరిచాలని తెలిపాను. సీఐ పర్యవేక్షణలోనే రమేష్ తనపై ఇష్టానుసారంగా అసభ్యకర పదజాలంతో దూషించడం జరిగిందన్నారు. అయినప్పటికీ తన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోపం దృక్తుడైన రమేష్ సిఐ సమక్షంలోనే తన కుడి చేయి నా మొహం పై దాడి చేసి గాయపరిచాడని ఆరోపించారు. సీఐ పిలవడంతో స్టేషన్కు వెళ్లిన తనపై పోలీసుల సమక్షంలోనే చేసుకున్న అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.