calender_icon.png 11 October, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడం: ప్రధాని మోదీ

11-10-2025 01:11:02 PM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకాన్ని(PM Dhan-Dhanya Krishi Yojana) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని(Narendra Modi) మాట్లాడుతూ... వ్యవసాయం, రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని తెలిపారు. రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని నరేంద్ర మోదీ ఆరోపించారు.

పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉన్నామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం(NDA Government) వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని ఆయన వివరించారు. వ్యవసాయ రంగంలో నేడు 2 పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత అన్నారు. రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని తెలిపారు.