calender_icon.png 11 October, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి: పవన్

11-10-2025 01:24:43 PM

మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలున్నాయి

అమరావతి: విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన' ఆమె సూర్యుడిని కబళించింది'(Aame Suryudini Kabalinchindi) పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని పిలుపునిచ్చారు. భారతీయ ఆలోచనా విధానం నుంచి వచ్చిన వాణ్ని అన్నారు. ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి క్యారెక్టర్ చదివానని పవన్ సూచించారు. మాలతి క్యారెక్టర్ లో ధైర్య సహసాలు, మేధస్సు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ స్వాతంత్ర్యం, ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలు పుస్తకంలో కనిపిస్తాయని తెలిపారు. మనదేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయని వివరించారు. జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీర మహిళగా పేరు పెట్టామన్నారు.