11-10-2025 12:54:03 PM
రూ, 5 లక్షల ఎక్స్ గ్రేషియా, సోదరులకు ఉద్యోగావకాశాలు
మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: ఇటీవల అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహం శనివారం తెల్లవారుజామున బీఎన్ రెడ్డి డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహానికి చేరింది. ఈ మేరకు మంత్రులు శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు చంద్రశేఖర్ మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చంద్రశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్రేషియా: మంత్రి
చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. మృతుడి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్య పడొద్దంటూ భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్రేషియా ప్రకటించారు. మృతుడి సోదరులకు అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్లో లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.