11-10-2025 12:37:14 PM
దేవాదాయశాఖలో పొంగులేటి జోక్యం.. కొండా సురేఖ దంపతులు ఫిర్యాదు
హైదరాబాద్: వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు కొండా మురళీ(Konda Murali) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు(AICC President Mallikarjun Kharge) కొండా మురళి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) కలుగజేసుకుంటున్నారని చేసిన ఫిర్యాదులో కొండా మురళి పేర్కొన్నారు.
పొంగులేటి సొంత కంపెనీకి పనులు ఇప్పించుకున్నారని మురళీ ఆరోపించారు. వరంగల్ జిల్లా రాజకీయాలను(Warangal politics) కొండా మురళీ ఖర్గేకు వివరించారు. మంత్రి పొంగులేటి ఇబ్బంది పెడుతున్నారని కొండా దంపతులు వాపోయారు. దేవాదాయశాఖలో పొంగులేటి జోక్యంపై కొండా సురేఖ దంపతులు ఫిర్యాదు ప్రస్తుతం కలకలం రేపింది. ఈ అంశాన్ని కొండా మురళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కొండా దంపతులు వెల్లడించారు.