27-05-2025 06:39:28 PM
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ పైడిపల్లిలోనీ జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ(Jannu Vamsa Welfare Society) నూతన కమిటీ ఏర్పాటు కోసం స్థానిక కార్పొరేటర్ జన్ను శీభారాణి అనిల్ కుమార్ లకు జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జన్ను యిర్మీయా ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. జూన్ ఒకటో తేదీన ఆదివారం రోజున పైడిపల్లిలోని జెడ్ పి ఎస్ ఎస్ హైస్కూల్లో సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జన్ను యిర్మీయా, జనరల్ సెక్రెటరీ. రెవ.డాక్టర్ జన్ను ప్రభాకర్, కన్వీనర్ జన్ను సొలోమోన్, ఫండ్ రైసింగ్ కమిటీ చైర్మన్ రెవ.జన్ను ఏసు పాదం, ఉపాధ్యక్షులు జన్ను సొలోమోన్, తదితరులు పాల్గొన్నారు.