15 April, 2026 | 1:53 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

నెహ్రూ సేవలు చిరస్మరణీయం

27-05-2025 06:45 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): భారత ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాయపోల్ మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు దయాకర్, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ స్వామిలు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన రాయపోల్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి(Jawaharlal Nehru Death Anniversary)ని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడిగా, భారత తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ దేశానికి అందించిన సేవలు మరువలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, దుర్గ ప్రసాద్, ప్రశాంత్, ఇంద్రకరణ్, యాదగిరి, కనకయ్య, ఎల్లం, బాబు, అశోక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.