3 July, 2026 | 5:14 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

రైజర్స్‌కు నిరాశ!

27-05-2024 01:49 AM

తుదిపోరులో సన్‌రైజర్స్‌కు ఏదీ కలిసి రాలేదు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతూ విశ్వరూపం కనబరిచిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ శర్మను స్టార్క్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. తదుపరి ఓవర్‌లో లెంగ్త్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన ట్రావిస్ హెడ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీజన్ ఆసాంతం రైజర్స్ బ్యాటింగ్ భారాన్ని మోసిన ఈ ఇద్దరు ఫైనల్ ఫైట్‌లో కాడి ఎత్తేయగా.. ఆ తర్వాత బాధ్యత తీసుకునే వారే కరువయ్యారు.

రాహుల్ త్రిపాఠి విఫలం కాగా.. మార్క్మ్ విలువ చాటుకోలేకపోయాడు. ఇక తెలుగు కుర్రాడు, బర్త్‌డే బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి వినూత్న షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్‌కు చిక్కగా.. షాబాజ్, సమద్ ఇలా వచ్చి అలా వెళ్లారు. క్లాసెన్ కాసేపు పోరాడినా.. భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనైనా మనవాళ్లు మ్యాజిక్ చేస్తారనుకుంటే అదీ అత్యాశే అయింది. కేకేఆర్ బౌలర్లు విశ్వరూపం కనబర్చిన చోట మన బౌలింగ్ యూనిట్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కమిన్స్ రెండో ఓవర్‌లో నరైన్‌ను ఔట్ చేసి ఆశలు రేపినా.. అది చివరి వరకు కొనసాగలేదు. రహ్మానుల్లాతో కలిసి వెంకటేశ్ అయ్యర్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత మూడు సీజన్లుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడిన హైదరాబాద్ ఈ సారి దుమ్మురేపినా.. చివరకు రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.