calender_icon.png 27 November, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

27-11-2025 04:47:28 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ఈనెల 15న పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ పోటీలలో పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల 20 మంది విద్యార్థులు 13,15,19 సంవత్సరాల బాల బాలికల విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి ఎంపికైన క్రీడాకారులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు గురువారం అభినందించారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 28 తేదీ నుండి 30 వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, శివ, సతీష్, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.