calender_icon.png 27 November, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

27-11-2025 04:49:34 PM

జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి

పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిట్యాల (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించే నామినేషన్ కేంద్రాలను గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె నల్గొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి జిల్లా కలెక్టర్ తో పాటు, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో వెలిమినేడు క్లస్టర్ కు సంబంధించి ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

నామినేషన్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్  వద్దకు వెళ్లి అక్కడ  నామినేషన్ పత్రాలు, నామిషన్లు వేసే సందర్భముగా అభ్యర్థులు పాటించవలసిన సూచనలు, ఇతర నియమ నిబంధనల కాఫీలు, నామినేషన్ పత్రంతో పాటు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు పరిశీలించడమే కాకుండా హెల్ప్ డెస్క్ లోని ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం నామినేషన్ల స్వీకరించే ఆర్ ఓ గదిని, మెటీరియల్ ను, ఇతర ఏర్పాట్లను పరిశీలించి నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అనుసరిస్తున్న ప్రక్రియను అడిగి తెలుసుకుని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, చిట్యాల ఎంపిడిఓ ఎస్ పి. జయలక్ష్మి తదితరులు ఉన్నారు.