13-01-2026 08:22:22 PM
హనుమకొండ,(విజయక్రాంతి): మరిపెళ్లి గూడెం గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ ఉస్మానియా యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. జనవరి 14వ తారీకు నుండి 17వ తారీఖు వరకు ఆల్ ఇండియా యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు చెన్నయ్ లో జరగనున్నాయి.
ఈ పోటీలకు ఉస్మానియా యూనివర్సిటీ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుచున్న మహమ్మద్ ఇర్ఫాన్ సారద్యం వహించనున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల టోర్నమెంట్ లో ఇర్ఫాన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ జట్టుని చరిత్రలో మొదటి సారిగా విజేత గా నిలపడంలో కీలక పాత్ర వహించడం జరిగింది.
తండ్రి అజ్మత్ పాషా స్వయంగా బాల్ బాడ్మింటన్ క్రీడాకారుడు కావడం వలన అతని పర్యవేక్షణ లో 8వ తరగతి నుండి ప్రతిరోజూ ఒక గంట ప్రాక్టీస్ చేసి ఈ స్థాయి కి చేరుకోవడం జరిగింది. గతంలో నాలుగు నేషనల్ ఎనిమిది రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ జట్టు కి కెప్టెన్ ఎన్నిక కావడం పట్ల మర్రిపల్లి గూడెం గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి మరియు గ్రామ సీనియర్ క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.