calender_icon.png 14 January, 2026 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం 40 డివిజన్లలో పోటీ

13-01-2026 08:25:06 PM

- ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్

ముకరంపుర,(విజయ క్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 40డివిజన్లలో కమిటీలు ఏర్పాటు చేసి, పూర్తిస్ధాయిలో ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉందని, 40 డివిజన్లలో పోటీ చేసి 36 డివిజన్లలో విజయఢంకా మోగించి మేయర్, డిప్యూటీ మేయర్లను కైవసం చేసుకుంటుందని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. నగరంలోని 30వ డివిజన్ నుంచి మాజీ వైఎస్సార్ సీపీ నాయకుడు గాలి ప్రశాంత్ బాబు, గాలి రాజు, గాలి వెంకటేష్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఎంఐఎంలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి గులాం అహ్మద్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా మద్దతు ఉన్నవారికి ఎంఐఎం పార్టీ నుంచి టికెట్లు కేటాయిస్తామన్నారు. ప్రజా సమస్యలను తీర్చే వారికి, సమాజ సేవ చేసిన వారికి ఎంఐఎం లో గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, ఇబ్రహీం, ఆతిన, ఖమరొద్దీన్, ఖాజా, అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, అలిబాబా, అజర్ దబీర్, మాజిద్ హుస్సేన్, ఆరిఫ్ అహ్మద్, సాజిద్, మజారోద్దీన్, అబ్దుల్లా అసిమ్, తాజుద్దీన్, అసదుల్లా బేగ్, తదితరులు పాల్గొన్నారు.