2 July, 2026 | 2:36 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు

19-06-2025 01:05 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జూన్ 18 ( విజయ క్రాంతి ): ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో అవకతవకలు జరుగుతున్నాయని, బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అసలైన నిరుపేదలకు ఇండ్లు రావడంలేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రచారం చేయాల్సిన అధికారులే పట్టించుకోవడం లేదని కలెక్టర్కు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు వస్తున్న వాటాను తెలియజేయాలని, ఇండ్ల మంజూరి పత్రాలపై ప్రధానమంత్రి ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు.  రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రుణం తీసుకున్న వారికి రుణమాఫీ కాలేదని బిజెపి నేత తెలిపారు. రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ పెట్టి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. 

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కిసాన్ మోర్చా  ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,BJP నాయకులు మెంబర్, వంగేటి విజయ్ భాస్కర్ రెడ్డి, ఏలే చంద్ర శేఖర్, పన్నల చంద్ర శేఖర్, వైజయంతి, ఉమ శంకర్ రావు,పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, డి ఎల్ ఎన్ గౌడ్ , పట్నం కపిల్, దయ్యాలు కుమార్, మంగు నరసింహారావు, రాళ్లబండి కృష్ణ చారి, ఉడుత భాస్కర్, వాస నర్సింగ్ తుమ్మల నాగేష్, రావుల సంతు  మరియు పాల్గొన్నారు,