2 July, 2026 | 3:39 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

కేజీబీవీ పాఠశాల భవనం ప్రారంభం

19-06-2025 01:07 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, జూన్ 18 : కొండమల్లేపల్లి మండలం కొలముంతల్ పహాడ్ రైతు వేదిక సమీపంలో నూతనంగా నిర్మించిన కేజీబీవి పాఠశాల భవనాన్ని బుధవారం దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత  ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాలలో సరైన వసతుల్లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అని అన్నారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి అన్ని హంగులతో నూతన భవనాలను నిర్మిస్తున్నారు అని పేర్కొన్నారు.40% డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢసంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జమున మాధవ రెడ్డి,డాక్టర్ వేణుధర్ రెడ్డి, దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, సిరాజ్ ఖాన్, ఆలంపల్లి నర్సింహా, ఊట్కూరి వేమన్ రెడ్డి, డి ఈ శైలజ, ఏఈ లస్కర్, ప్రిన్సిపాల్ సరళ తదితరులు పాల్గొన్నారు.