calender_icon.png 22 May, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి

21-05-2025 07:17:45 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): ఏసీబీ వలకి మరో అవినీతి అధికారి చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏఈ ఇస్లావత్ వినోద్ రెండ్ హ్యండెడ్ గా ఏసీబీకి వలకి చిక్కారు. మిషన్ భగీరథ ఇంట్రా విభాగంలో ఏఈగా పని చేస్తున్న వినోద్ ఇటీవల బదిలీపై సూర్యపేటకు వచ్చారు. ఎంబీ బుక్ రికార్డ్, రూ.20 లక్షల బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేశారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తూ పథకం ప్రకారం మంగళవారం రాత్రి కోదాడ వద్ద బాధితుడి నుంచి ఇస్లావత్ వినోద్ అన్న కుమారుడు మూర్తితో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వెంబడిస్తున్నారని గుర్తించిన మూర్తి డబ్బులతో పరారయ్యాడు. వినోద్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.