21-05-2025 01:50:32 PM
హైదరాబాద్: నగరంలో బుధవారం మధ్యాహ్నం బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్(Hyderabad rain) నగరంలోని సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, నాంపల్లి, చార్మినార్, కోఠి, అబిడ్స్, రామంతపూర్, మెహదీపట్నం, కొత్తపేట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, అంబర్‌పేటలలో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గతంలో, భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హైదరాaబాద్‌కు రాబోయే మూడు రోజులు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మే 22 వరకు సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. అటు తెలంగాణ లోని పలు జిల్లాలో జోరు వర్షం కురుస్తోంది. వరంగల్, సూర్యాపేట, నర్సంపేట, ఖనాపురం మండలాల్లో వర్షం పడింది. వర్షం కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లోధాన్యం తడిసిపోతుంది.