2 July, 2026 | 1:11 AM

కట్టు కాలువలను కాపాడాలి

02-07-2026 12:00 AM

రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు బల్దియా చైర్మన్ వినతి

గుమ్మడిదల, జూలై 1 : గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని కట్టు కాలువలను పరిరక్షించి గ్రామానికి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, పాలకవర్గ సభ్యులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ పరమేశం, ఇరిగేషన్ శాఖ అధికారి చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు.

ఇటీవల ప్రభుత్వం సర్వే నంబర్ 109లోని భూమిని టీజీఐఐసీకి కేటాయించగా, ఆ ప్రాంతం గుండా గ్రామంలోని ఎర్రచెరువుకు నీరు చేరే కట్టు కాలువపై సీసీ రోడ్డు నిర్మించినట్లు పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.దీంతో వర్షాకాలంలో చెరువుకు చేరాల్సిన నీటి ప్రవాహం దెబ్బతినే అవకాశం ఉందని, భవిష్యత్తులో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కట్టు కాలువల సహజ స్వరూపాన్ని కాపాడాలని, నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా అవసరమైన మార్పులు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంధ్యా రెడ్డి, కౌన్సిలర్లు మాధవి, కో నాయకులు వెంకట్రాంరెడ్డి, హుస్సేన్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.