11 June, 2026 | 3:45 AM

పెద్ద చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు..

11-08-2025 11:02 PM

తూప్రాన్ (విజయక్రాంతి): గ్రామంలోని పెద్ద చెరువు కట్టను తోల్చి తన పొలమునకు దారి చేసుకున్నాడని యావపూర్ గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీంతోపాటు వార్తా కథనాల్లో ప్రచురితం కావడంతో తూప్రాన్ మండల ఇరిగేషన్ అధికారులు(Toopran Mandal Irrigation Officer) సోమవారం యావాపూర్ లో పెద్ద చెరువు కట్టను పరిశీలించారు. చెరువు క్రింది భాగంలో ఉన్న పొలాలకు సంబంధించి రెండు త్రోవలు ఉండగా ఒక త్రోవను రద్దు చేసి మరొక త్రోవను రైతుల అవసరాలు నిమిత్తం వాడుకోవాల్సిందిగా రైతులతో సూచించారు.