calender_icon.png 12 August, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఇప్పించి న్యాయం చేయండి

12-08-2025 12:00:00 AM

జనగామ, ఆగస్టు 11 (విజయక్రాంతి) అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని భూ కబ్జాదారుల నుండి రక్షించి తిరిగి ఇప్పించి మాకు న్యాయం చేయాలని జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం శ్రీమన్నారాయణ పురం గ్రామానికి చెందిన బత్తిని రవీందర్ సోమవారం మీడియా ముఖంగా తమ గోడు వెల్లబోసుకున్నారు .వివరాల్లోకి వెళితే శ్రీమన్నారాయణ పురం గ్రామం 286 సర్వేనెంబర్ గల భూమి  విషయంలో  కోర్టులో కేసు నడుస్తున్న కూడా గంగపురం సోమయ్య పార్థసారథి తండ్రి కొడుకులు.

2023లో రిజిస్ట్రేషన్  చేసుకున్నారని కోర్టులో కేసు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారని   ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా  కూడా ఫలితం లేక మీడియం ఆశ్రయించడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు  ఈ భూమి విషయమై విచారణ చేసి కలెక్టర్  ఆర్డీవో  మాకు న్యాయం చేయాలని భూ బాధితుడు బత్తిని రవీందర్   మీడియా ముఖంగా అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.