సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
నీరు విడుదల చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్ ఆగస్టు ౯ ( విజయ క్రాంతి) ప్రస్తుత వర్షాకాల పరిస్థితుల్లో రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని డ్యాంలో నుంచి సాగునీరు విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ మాట్, కడం రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో వర్షాభావం ప్రభావాల వల్ల రైతన్నల అవస్థలు దృష్టిలో పెట్టుకొని పంట కాలాన్ని వృధా కానివ్వకుండా సాగునీరు పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని ఆయన అన్నారు .
కార్యక్రమంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు పడగల భూమన్న, మాజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, ఖానాపూర్ కడం మండల కాంగ్రెస్ అధ్యక్షులు జంగిలి శంకర్, బొడ్డు గంగన్న, పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ ,మాజీ మండలాధ్యక్షుడు దొనికేని దయానంద్, సర్పంచులు రాజు యాదవ్, సచిన్ ,నాయకులు దేవతి రాజేశ్వర్, జన్నారపు శంకర్, పలువురు ఉన్నారు.






