10 August, 2026 | 3:47 AM

బోనమెత్తిన ఎమ్మెల్యే పటేల్..

10-08-2026 12:00 AM

బైంసాఆగస్టు ౯ ( విజయ క్రాంతి)కుంటాల మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావుపేట హాజరై పూజలు నిర్వహించారు  భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

మహిళలు సాంప్రదాయ బోనాల కుండలను నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గజేందర్ మాజీ ఎంపీపీ గజ్జరం సీనియర్ నాయకులు రమణారావు కె రవి గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.