చట్టసభల్లో సీట్లపెంపు అవసరమా?
ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు, వారికి సేవలు అందించే పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది, వాహనాలు, సౌకర్యాలు, ఇతర ఖర్చులు తడిసి మోపెడై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయి. దినదినం ప్రజలపై అధికారిక, అనధికారిక అవినీతి భారం పెరిగిపోతున్నది. ఇక సీట్ల పెంపుదలతో ప్రజలకు ఓరిగేదేమీ లేదు, మరింత ఆర్థిక భారం తప్ప. ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలని ఏ ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించిన ప్రజలు అడగడం లేదు.
చట్టసభల్లో అదనంగా 50 శాతం సీట్లు పెరగడం ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు, ప్రజల మీద పడే ఆర్థిక భారం అంచనా వేసుకుంటే ఇప్పటికే ఉన్న సభ్యుల సంఖ్య సరిపోతుందనే ప్రజలు అంటున్నారు. జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం లేదని, వారి ప్రాతినిధ్యాన్ని 33 శాతం పెంచడానికి చట్టసభలలో ఏకంగా 50 శాతం సీట్లను పెంచుకోవడం సరైన పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోకసభ సీట్లలోనే మహిళలకు 33 శాతం కోటాను ఇవ్వడానికి ఎవరు అడ్డురారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం పార్టీలకు, నాయకులకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సీట్ల పెంపుదల ప్రక్రియ ప్రారంభమైందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు భావిస్తు న్నారు. ఆర్థిక వ్యవస్థను ప్రైవేటీకరణ చేసిన తర్వాత రాజకీయాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు అనే భావన ఏర్పడిన సందర్భంలోనే పార్టీలు చట్టసభల సీట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టడం జరిగిందని భావిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోకసభలో, శాసనసభలలో సభ్యుల సంఖ్య 50 శాతం పెరుగుతుందని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా సెలవిచ్చారు.
బిల్లులో మాత్రం అన్ని రాష్ట్రాలకు ఏకంగా 50 శాతం పెంచే ప్రస్తావన లేదు. సీట్ల సంఖ్య పెరగడం వలన పరిపాలన సౌలభ్యత పెరుగుతుందని, పరిపాలన ప్రజలకు చేరువవుతుందని, మహిళ లకు 33 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని పాలకులు హితవు పలుకుతున్నారు. ఈ ప్రతిపాదన కేవలం పాలకవర్గాలదే తప్ప ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాదనేది నూటికి నూరు శాతం వాస్తవం. ఇప్పటికీ పార్లమెంట్‌లో మహిళలకు 15 శాతం శాసనసభలలో ఏడు నుంచి తొమ్మిది శాతం ప్రాతినిధ్యం మాత్రమే లభిస్తున్నది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు, అందులో మహిళలకు కాని చట్టసభలలో రిజర్వేషన్ కల్పించడం లేదు.
ప్రస్తుతం వెనుకబడిన కులాల మహిళలకు ఒక్క శాతం సీట్లు కూడా దక్కడం లేదు. ఈ విషయంలో అన్ని పార్టీలకు చెంది న నాయకులు, పాలకులు మౌనం వహించడం విశేషం. మన ధనస్వామ్య గణతంత్ర వ్యవస్థలో పేద వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండాపోతున్నది. నిత్యం ప్రజలు ఎదుర్కొనే ధరల పెరుగుదల, నిరుద్యోగిత, సాంఘిక ఆర్థిక అభద్రత, ప్రాంతీయ అసమానతలు లాంటి జఠిలమైన ఆర్థిక, సామాజిక సమస్యల గురించి చర్చించడానికి కూడా తీరికలే ని పాలకులు తమ సీట్లు పెంచుకోవడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ఇప్పటికే చట్టసభలలో ఎన్నికైన నాయకులకు జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులే తడిసి మోపెడు అవుతున్నాయని లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తు న్న ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభు త్వ నిర్వహణ ఖర్చులు కలిసి రాష్ట్ర రెవెన్యూ లో 30 నుంచి 40 శాతానికి చేరుకున్నాయి. అనేక రాష్ట్రాలు అప్పులపాలై వడ్డీలు కట్టలేక కునారిల్లుతున్నాయి. దీంతో సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలు కుంటుపడుతున్నాయి.
అనధికారికంగా జరుగుతున్న వృథాతో పా టు అధికారికంగా ప్రతి పార్లమెంట్ సభ్యునిపై ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కనీసం ఐదారు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నదని ఒక అంచనా. ఇప్పటికే గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్‌లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాజ్యసభ, లోకసభ సభ్యులు ఇంకా అనేకమంది నామినేటెడ్ పదవులు పొందిన రాజకీయ, మేధావి వర్గం ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తూనే ఉన్నారు.
అయినా అవినీతికి పాల్పడకుండా కాగితం కదలడం లేదు. ప్రభుత్వ పాలనలో నాయకులకు జీతభత్యాలు, వారికి సేవలు అందించే పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది, వాహనాలు, సౌకర్యాలు ఇతర ఖర్చులు తడిసి మోపెడై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నా యి. దినదినం ప్రజలపై అధికారిక, అనధికారిక అవినీతి భారం పెరిగిపోతున్నది. ఇక సీట్ల పెంపుదలతో ప్రజలకు ఓరిగేదేమీ లేదు, మరింత ఆర్థిక భారం తప్ప. ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలని ఏ ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించిన ప్రజలు అడగడం లేదు. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ధనవంతుల సంఖ్య విపరీతంగా పెరిగి ఆర్థిక అంశాలే దేశ, రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
కార్పొరేటు పారిశ్రామిక సంస్థల యజమానులు, వారి వారసులు చట్టసభల కు రావడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తు త సభ్యులతో మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప, కొత్తగా సీట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఈ సీట్ల పెంపు వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని ప్రజా సేవకులు గుర్తించాలి.






