నోటిఫికేషన్లు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్లా?
ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూ రు వెంకట్ పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో కేవలం నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారని, ఉద్యోగం మాత్రం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనిశనివారం గాంధీభవన్‌లో మీడియా ఎదుట స్పష్టం చేశా రు.
జీవో 46కు వ్యతిరేకంగా నిరుద్యోగులతో కలిసి ఉద్యమించామని, ఇప్పుడు కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవో 46,317లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్నారు. ఉ ద్యోగాలు అమ్ముకోవడానికి గతం లో పేప ర్ లీక్ చేశారని, వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సాంకే తిక కారణాల వల్లే స్టాఫ్ నర్సులకు వేతనాలు ఆలస్యమయ్యాయని, ఉ ద్యోగులకు మాత్రం ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రయివేట్ కాలేజీలు, పాఠశాలల్లో వేసవి క్లాసులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.






