3 July, 2026 | 9:29 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

ఎన్నికలు ఉంటేనే భరోసానా?

24-06-2025 01:49 AM

బీజేఎల్పీ నేత ఏలేటి 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఎన్నికలు ఉన్నపుడే రైతు భరోసానా అని, రైతు భరోసా పథకం ఈ సీజన్‌కి చివరిదైపోతోందన్న అనుమానం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోందని... తర్వాత ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్న చర్చ నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

రైతుల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తే, బీజేపీ కచ్చితంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్ధానిక సంస్ధలకు ఎన్నికల నేపథ్యంలో వానాకాలం రైతు భరోసా ఇస్తున్నారని విమర్శించారు. ఓట్లు ఉంటనే రైతు భరోసా ఇస్తారా ... ఈ లెక్కన ఇదే చివరి రైతు భరోసానా అనే అనుమానాలు తలెత్తు తున్నాయని అన్నారు.