3 July, 2026 | 10:25 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పేదలకు నాణ్యమైన విద్య దూరం

24-06-2025 01:48 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకోవాలి
  2. రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చూడాలి
  3. రాష్ట్రీయ లోక్‌దళ్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): 2009లో కేంద్రప్రభుత్వం చేసిన విద్యాహ క్కు చట్టం సక్రమంగా అమలు చేయ కపోవటంతో దాదాపు 9 లక్షల మంది ఎస్సీ, ఎసీ,్ట బీసీ, పేద విద్యార్థులు నాణ్యమైన ఉచితవిద్యను అందుకోలేకపోతున్నారని రాష్ట్రీ య లోక్‌దళ్ తెలంగాణ అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ తెలిపారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ లో దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టంపై రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్త న కంపెనీ, దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలకు పదునుపెట్టాలని, నకిలీ విత్తనాలని నిర్ధారణ అయితే వాస్తవ దిగుబడికి 3 రెట్లు రైతుకు దక్కేలా ప్రభుత్వ మే చెల్లించే హామీ ఇవ్వాలని డిమాండ్ చేశా రు.

నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సకాల ంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేకున్నా మంత్రులుగా పాలించే వారి హక్కుపై తాము ప్రశ్నించబోమని, ప్రజా తీర్పే తమ పార్టీకి శిరోధార్యమణి స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖనే ‘మా మంత్రులు కమీషన్ తీసుకుంటున్నారు’ అ న్న మాటలు మీడియాలో వచ్చినా తగిన చ ర్యలకు సీఎం చొరవ తీసుకోకపోవటం ఆక్షేపణీయమన్నారు.

ఆరోపణలపై విచారణ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలని సీఎంకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అభివృద్ధిలో గానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలోనే గానీ ఏమాత్రం ముందడుగు వేయలేదన్నారు. రెండేళ్లుగా రాష్ర్టంలో హడావుడి తప్ప చేసిన అభివృద్ధి భూతద్దం పెట్టినా కనిపించడం ఎద్దేవా చేశారు.