calender_icon.png 3 December, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా భర్తను సస్పెండ్ చేయడం ప్రభుత్వానికి తగునా?

03-12-2025 12:00:00 AM

  1. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన స్వప్న భాస్కర్ 

గ్రామానికి ఎన్నో సేవలు అందించాడు 

ప్రతి పేదోడి ఇంటికి అన్నలా వచ్చాడు 

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తగునా..?

గోపాలపేట, డిసెంబర్ 2: నేను సర్పంచ్ పోటీకి వెళ్లడంపై మా భర్తను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగునా  గోపాలపేట నూతన సర్పంచిగా నామినేషన్ పదవికి వేసిన స్వప్న భాస్కర్ తన భర్తను నిర్దర్శనంగా కక్ష పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న నా భర్తను సస్పెండ్ చేయడంపై స్వప్న భాస్కర్ మండిపడ్డారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలో స్వప్న భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన భాస్కర్ , హైదరాబాద్లోని ఫిలింనగర్‌లో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

గత ఐదేళ్ల నుండి తన భర్త భాస్కర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబాలకు ఎన్నో సేవలందించాడు. అంతేకాకుండా పాఠశాలలకు పేద విద్యార్థులకు భాస్కర్ పెద్దన్నలా ఉండి సేవ భావంతో ఎంతో ఖర్చు చేస్తున్నాడు. ఇది ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న బిగుతో ఫిలింనగర్ లో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న తన భర్తను విధులకు హాజరు కాలేదని సస్పెండ్  చేయించడం వారి అవివేకానికి సిగ్గుచేటని విమర్శిం చారు.

గోపాలపేట జనరల్ మహిళా రిజర్వేషన్ కావడంతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ టికెట్ స్వప్న భాస్కర్కు ఇవ్వడం పట్ల జీర్ణించుకోలేకపోయారని అన్నారు. నా భర్తను సస్పెండ్ చేయించిన భయపడేది లేదని. నిర్భయంగా తాను పోటీలోకి దిగడం ఖాయమన్నారు. ప్రజా అండ స్వప్న భాస్కర్ కు మెండుగా ఉందని ప్రజల దీవెనలు నాకు వెన్నంటి ఉన్నాయని ఎవరని ఎత్తుగడలు వేసిన తాను మాత్రం గోపాలపేట సర్పంచిగా విజయ గీతం మోగించడం ఖాయమని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేయకుండా తన భర్తను యధా మాదిరిగా విధుల్లోకి తీసుకోవాలని కర్రోళ్ల స్వప్న కోరారు.