03-12-2025 12:00:00 AM
జహీరాబాద్ టౌన్, డిసెంబర్ 2 : సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ మహాసభల బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ పిలుపునిచ్చారు.
మంగళవారం శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ పారిశ్రామి క్లస్టర్ కమిటీ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ కార్మిక ప్రజా పోరాటాల సారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర ఐదో మహాసభలు ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ లో జరగనున్నాయని గత కార్యక్రమాలు చర్చించి భవిష్యత్తు ఉద్యమాలు పోరాటాలను రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు పోరాటాలు కార్మికుల హక్కుల పరిరక్షణకు జరుగుతాయని తెలిపారు.
అందుకోసం నిర్వహించే ఈ మహాసభల బహిరంగ సభలో కార్మిక వర్గం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల సీఐటీయూ యూనియన్ల నాయకులు రాజిరెడ్డి నరేష్ మహేశ్వర్ గణేష్ నారాయణ సందీప్ రెడ్డి కిరణ్ పాషా శివరామరావు బాబుపాల్గొన్నారు.