calender_icon.png 1 October, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి భూములకు రక్షణ కరువు?

02-10-2025 12:00:00 AM

  1. సౌత్ క్రాస్ కట్ గని భూమి ఎసరుకి భారీ స్కెచ్..? 
  2. సివిల్ డిపార్ట్మెంటు స్థలంపై కన్ను..?
  3. ప్రమాదకర స్థలాన్ని కూడా వదలని వైనం
  4. పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు ఆరోపణలు ? 

బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 30: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆక్రమణలకు ఎవరు అతీతం కాదు. పలుకుబడి సంఘం లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు సింగరేణి భూమికి ఎసర పెడుతున్నట్లు సమాచారం. పట్టణ నడిబొడ్డున గల మూసివేత భూగర్భ గని సౌత్ క్రాస్ కట్ ఆవరణలోని విలువైన భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ మేరకు రాజకీయ పలుకుబడి కలిగిన సదరు వ్యక్తులు ఈ స్థలాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.

ఇప్పటికే చెట్లను తొలగించి చదును చేపించారు. సౌత్ క్రాస్ కట్ గని 1976లో ఆకస్మికంగా గని ప్రమాదం చోటుచేసుకుని అర్ధాంతరంగా మూతపడింది. ఈ గని ఆవరణలోని విశాలమైన భూమిలో ఇప్పటికే నీవేశాలను ఏర్పాటు చేసుకొన్నారు. చుట్టుపక్కల విలువైన ఖాళీ స్థలమంతా గృహాల నిర్మాణంతో నిండిపోయింది. మిగిలిన స్థలం పై కబ్జా కోర్ల  దృష్టి పడింది. ముఖ్యంగా గని పక్కకే ఓ కమ్యూనిటీ సముదాయం ఉన్నది.

దాని నిర్వాహకులే పలుకుబడిని ప్రయోగించి ఖాళీగా ఉన్న స్థలాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పిచ్చి మొక్కలను తొలగించి చదును చేశారు. చదును చేసిన స్థలం ఆవరణ మూతపడిన సౌత్ క్రాస్ కట్ భూగర్భ గనిలో పరిధిలోనిది. కాగా తమ పలుకుబడి, ఆర్థిక బలంతో  కమ్యూనిటీ హాల్ కి దారి కోసమనీ ఈ స్థలా న్ని సొంతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రధాన రహదారి వైపు ఆ కమ్యూనిటీ హాల్ కి ప్రధాన ద్వారం ఉంది. గని ఆవరణ స్థలాన్ని కైవసం కోసం మరో ద్వారాన్ని తీశారు. కమ్యూనిటీ హాల్ ద్వారం నెపంతో ఉన్న సింగరేణి స్థలాన్ని కూడా ఆధీన పరుచుకోవడానికి ప్లాన్ వేశా రు. ఇప్పటికే  అధికారుల అనుమతి కోసం జోరుగా పైరవీలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ లీడర్‌తో డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం.

అందుకుగాను ముందస్తుగా రూ.లక్షల్లో ముట్ట చెప్పారని ప్రచారం జరుగుతుంది. ఈ భూదందా వ్యవహారంపై సింగరేణి ఎస్ అండ్పీ సీ అధికారు లకి  ఉప్పందంది. రంగంలోకి దిగిన ఎస్ ఎన్ పీసీ సిబ్బంది వచ్చి చదును చేసిన స్థలoలో నిర్మాణానికి ఉద్దేశించిన ఇసుక, పునాది బండలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ స్థలం కోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి.

ఆక్రమణకు భారీ స్కెచ్..

సౌత్ క్రాస్ కట్ గని పక్కనే పాత సివిల్ డిపార్ట్మెంటు  స్థలం కలిసే ఉంటుంది. ప్రధా న రహదారికి ఆనుకొని ఉండే ఈ స్థలం కోట్ల రూపాయల విలువైంది. ఈ స్థలాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే భారీ స్కెచ్‌లో భాగంగా ఓ కమ్యూనిటీ నిర్వాహకులు తమ రెండో ద్వారం పక్కన ఉన్న గని ఖాళీ స్థలాన్ని వశపరచుకోవడానికి భారీ ప్రయత్నాలన్న ఆరోప ణలు వ్యక్తమవుతున్నాయి.

రెండు దశాబ్దల క్రితం సివిల్ డిపార్ట్మెంట్ ను యాజమాన్యం అక్కడి నుండి పాత జీఎం ఆఫీస్ కు తరలించింది. అప్పటినుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంది. పాత సివిల్ డిపార్ట్మెంట్ చుట్టుపక్కల స్థలం ఇప్పటికే కబ్జాకు గురికాగా, మిగిలిన స్థలంపై కబ్జాదారుల కంటపడింది. మూతపడిన సౌత్ క్రాస్ కట్ గని ఆవరణ ప్రాంతం ప్రమాదకరమైందని ఇప్పటికే సింగరేణి యాజమాన్యం సూచిక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది.

ఈ హెచ్చరికలు ఏమి ఫలించలేదు. యదేచ్చగా ఉల్లంఘించి ప్రమాదకరమైన స్థలమని తెలిసినప్పటికీ ఆ స్థలం లో నివాస గృహాలు, మందిరాలు వెలిశాయి. ఈ ఖాళీగా ఉన్న ఈ స్థలంలో ప్రమాదపు అంచులో వెలిసిన సముదాయాలను సింగరేణి యాజమాన్యం అడ్డుకోలేకపోయింది. అందుకు పలుకుబడి, రాజకీయ నాయకుల ప్రాబల్యం అడ్డొచ్చింది. అంతేకాదు ప్రమాదకరమైన ఈ స్థలంలో, సౌత్ క్రాస్ కట్ గని చుట్టూ గృహాల నిర్మాణంలో లక్షల రూపాయలు చేతులు మారాయి. ఇక మిగిలిన స్థలంపై దృష్టి పెట్టారు.

ప్రధానంగా పాత సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణ స్థలం లక్ష్యంగా కబ్జా ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికైతే అప్పగించడానికి అధికారులు సుముఖంగా లేరని తెలుస్తోంది. సౌత్ క్రాస్ కట్ గని ఆవరణ, సివిల్ డిపార్ట్మెంట్ సింగరేణి స్థలం పరిరక్షణ కోసం అధికారులు కాసింత కఠినంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా  సింగరేణి విలువైన స్థలాన్ని  కాపా డుకోవాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించరాదు. ఏం చేస్తారో చూడాలి మరి.