27 June, 2026 | 7:07 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

వడ్ల మిషన్‌లో చిక్కుకుని మహిళ మృతి

12-05-2026 01:35 AM

చేర్యాల, మే 11: వడ్ల మిషన్‌లో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కాశ గుడిసెల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కాశ గుడిసెల గ్రామానికి చెందిన ఇమాంబి(50) వడ్లు పట్టే మిషన్‌లో వడ్లు పోస్తుండగా తల వెంట్రుకలు మిషన్‌కు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త షేక్ సుభాన్, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. చేర్యాల ఎస్‌ఐ అపూర్వరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.