calender_icon.png 3 December, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంపముంచిన విలీనం

03-12-2025 12:00:00 AM

- గుమ్మడిదల మున్సిపాలిటీగా మారడంతో ఆశావహులకు నిరాశ

- అభ్యర్థులకు మద్దతునివ్వని అధికార పార్టీ నేతలు

-  కనిపించని స్థానిక ఎన్నికల సందడి

గుమ్మడిదల, డిసెంబర్ 2 :స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూసిన ఆశావహులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం మొదటి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయానికి గుమ్మడిదల మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండడంతో ఎన్నికల సంద డి బాగా కనిపించేది.

ప్రస్తుతం 13 గ్రామ పంచాయతీలకు గాను ఐదు గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం అయ్యా యి. ఈ ఐదు గ్రామపంచాయతీలు పూర్తిగా పారిశ్రామిక వాడ ప్రాంతమే కావడంతో గత ఐదు సంవత్సరాలుగా ఓడిపోయిన అ భ్యర్థులు గానీ ప్రజాసేవతో పాటు ప్రజలలో దూసుకుపోతూ వచ్చే ఎన్నికలలో పోటీ చేద్దామని సర్వం సిద్ధం చేసుకున్న ఆశావహులకు తీవ్ర నిరాశకు గురి చేసింది.

ము న్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేద్దామన్నా తమ స్థాయి వార్డు మెంబర్ వరకే కానీ కౌన్సిలర్ కు పోటీ చేయలేమని అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో వె నుకంజ వేస్తున్నారు. మున్సిపల్ ఏర్పాటుతో వారి ఆశలు నీరుగారడంతో మండల నాయకులు నిరుత్సాహంతో మిగతా ఎనిమిది గ్రా మపంచాయతీ ఎన్నికలకు మద్దతుగా ముందుకు రావడం లేదు.

ఎనిమిది గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ జరుగు తున్నా సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం అధికార పార్టీ నుండి మద్దతు తెలపడానికి కూడా మండల పార్టీ నాయకులు రావడం లేదంటే వారి నిరుత్సాహమే కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం ఎనిమిది గ్రామపంచాయతీలలో జరిగే ఎన్నికలలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ కనీసం వారికి మద్ద తుగా, అండగా కూడా నిలబడలేక పోతున్నారు.

ఓవైపు అధికార పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలని సూచిస్తున్నా మండల నాయకులు మాత్రం అభ్యర్థులకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయా గ్రామాల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పార్టీ ఒక్కటే అయినప్పటికీ పార్టీలో మాత్రం అటు కాటా శ్రీనివాస్గౌడ్ వర్గం, ఇటు నీలం మధు వర్గం కావడంతో విభేదాలతో గ్రామా ల ప్రజలు సతమతమవుతున్నారు. ఇదిలావుండగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాత్రం తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలబడి వారి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతిరోజు ఆయా గ్రామాలలో తిరుగుతూ పార్టీ కార్యకర్తలచే మంతనాలు జరుపుతున్నారు.