27-06-2025 01:43:06 AM
సామాన్యుడికి మొండి చేయి..
దళారులకు అపన్న హస్తం..
కొత్తగూడెం జూన్ 26 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం చాటవారిగూడెం గ్రా మంలో, మట్టి మాఫియా దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతోంది. స్థానిక నాయకులు అం డదండలతో చిలరేగిపోతున్న ఈ మట్టి మాఫియాలను అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు అని చెప్పకనే చెబుతున్నారు. మాఫియా బాబులు చాలెంజ్ లు విసురుతుండటం శోచనీయం. మట్టి దళారులకు, రెవిన్యూ శాఖ, పోలీసు శాఖ పూర్తి మద్దతు తెలుపుతున్నరని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇంత పెద్ద మాఫియా చటవారిగూడెంలో వెలుగులోకి వస్తే పట్టించుకునే అధికారులు కరువయ్యారు.ప్రశ్నించిన పా త్రికేయుల పైన విరుచుకుపడుతున్న, తరుణం చర్చనీయాంశంగా మారింది,రెవిన్యూ అధికారులకు భారీగానే, ముడుపు లు అందాయే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సమాచారం ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానాన్ని ఇస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు తీరుతో వస్తున్న ఆరోపణలను ద్రవపరుస్తున్నాయి.స్పందించని పోలీసు శాఖకు సైతం ముడుపులు అందాయి అన్న చర్చలు బాహటంగానే వినిపిస్తున్నాయి.
మం డల పరిధిలో ఏమి జరిగినా అధికారులు స్పందించరు, అన్న తీరున మట్టి మాఫియా చలరేగిపోతున్నారు. ఇదే అదునుగా ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పును సుమారు రూ 1000 చొప్పున అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టాలనుకుంటే రెవిన్యూ అధికారులు సామాన్యుడిని ముప్పతిప్పలు పెట్టి అనుమతుల పేరుతో ఆగం పట్టిస్తారు. మట్టితో వ్యాపారం చేసే వ్యాపారులకు ఎలా అనుమతులు ఇస్తున్నారనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల సైతం ముడుపులు ముడితేనే స్పందన లేకుండా ఉన్నారని పలువురు చెవులు కోరుక్కుంటూన్నారు. వారు నడిపే వాహనాల వేగం సైతం ప్రజల గుండెల్లో గుబులు పుడుతుంది. రహదారి గుండా ప్రయాణించే తోటి ప్రయాణికులు సైతం వాహనాల వేగానికి, ఓవర్ లోడ్ కు బెంబేలెత్తిపోతున్నారు. ఇదంతా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై మండల వాసులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసే వారిపై, అక్రమ మట్టి దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.