26 April, 2026 | 5:37 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఉత్తరాదిన త్రిభాషా విధానం ఉందా?

02-03-2025 12:00 AM

ఇటీవలి కేంద్ర ప్రభుత్వ సూచనలతో తమిళనాట మళ్లీ త్రిభాషా విధానంపై అగ్గి రాజుకుంది. తొలుత నుంచి తమిళనాడులో ద్విభాషా విధానమే కొనసాగుతూ హిందీని వారి రాష్ట్రంలో అమలు చేయటంలేదు. అది వారి విధానం. అంతెందు కు అక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు హిందీలో ఉం డకూడదు. ఇప్పుడే కాదు వేల సంవత్సరాల నుంచి అక్కడ తమిళానికే ప్రాధాన్యత. తమిళదేశంలో తెలుగు మూలాలున్న పల్లవు లు కంచిలో పాలన తమిళంలోనే చేశారు. విజయనగర రాజు లు, ఆంధ్ర నాయక రాజులు మధుర, తంజావూరు పాలించినప్పుడు, ఆ తరువాత మరాఠా రాజులు కూడా పాలన తమిళం లోనే చేశారు.

తమిళనాట లభించిన అనేక శాసనాలు తమిళ భాష లో తప్ప మరో భాషలో లేకపోవటం తమిళంలో వారి పాలనా విధానాన్ని తెలియచేస్తోంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ ఉన్నా ఆ రాష్ట్రాల్లో హిందీ, ఆంగ్లం తప్ప మరే ఇతర భారతీయ భాషను ఎంచుకుని, నేర్చుకునే ఆస్కారం హిందీ రాష్ట్రాలు కల్పించటం లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నామఫలకాలు హిందీ, ఇంగ్లీషులోనే ఉంటున్నాయి తప్ప ఆ ప్రాంత భాషలో లేకపోవటంపై కేంద్ర ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న దాదాపు అన్ని కేంద్ర ప్రభుత్వ, కంటోన్మెంట్ కార్యాలయాల నామఫలకాలు హిందీ, ఇంగ్లీషులోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో త్రిభాషా విధానాన్ని అమలు చేయా లి కాని, అనవసరంగా ఇతర రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దకూడదు. 

- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్.

మిగతా డిమాండ్లూ సాధించాలి

దేశంలోని బొగ్గు సంస్థలలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ పదవి పేరును జనరల్ అసిస్టెంట్ గా మార్చడం చాలా సంతోషం. అన్ని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఐక్యంగా పోరాడి తరతరాలుగా ఉన్న పేరును మార్చడం అభినందనీయం. ఈ పేరు సంఘంలో చాలా గౌరవనీయంగా ఉంటుంది.  ఇదే స్ఫూర్తితో బొగ్గు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్ పెంపుదల చే యుటకు, మెరుగైన వైద్య సౌకర్యాలుఉచితంగా కల్పించుటకు కృ షి చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. సింగరేణి లో ని అన్ని కార్మిక సంఘాల నాయకులు ఈ దిశగా కృషి చేస్తారని మనసారా కోరుతున్నాను మన కార్మిక సంఘాల నాయకులు పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏది కూడా ఉండదని ఇది రుజువు చేస్తున్నది.

- దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్