1 July, 2026 | 7:15 AM

ఫైనల్లో ఇషా సింగ్ షూటింగ్ ప్రపంచకప్

03-06-2024 01:43 AM

మ్యూనిచ్: తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 25 మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన ఇషా సింగ్ ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో 293 పాయింట్లు సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఇషా ఆరో స్థానంలో నిలవగా.. భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (281 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయింది. పురుషుల విభాగంలో సందీప్ సింగ్, దివ్యాన్ష్ పన్వర్, రుద్రాంక్ష పాటిల్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మహిళల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో రమిత (633 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. ఎలవెనిల్ వలరివన్, తిలోత్తమ సేన్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగారు.