calender_icon.png 4 May, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డు జారీ

03-05-2025 07:13:49 PM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్...

మంచిర్యాల (విజయక్రాంతి): రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) శనివారం తెలిపారు. పెండింగ్ లో ఉన్న నూతన రేషన్ కార్డులు, కార్డులలో సభ్యులను చేర్చడంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులను సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారిని ఎంపిక చేసి జిల్లాలో 956 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

రేషన్ కార్డులలో పిల్లలను చేర్పించుట, ఇతర మార్పులకు సంబంధించి 29 వేల 237 దరఖాస్తులు విచారించి ఆమోదించడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మీ-సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.