17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జాప్యం లేకుండా రేషన్ కార్డులు జారీ చేయండి

21-06-2025 01:05 AM

మలక్‌పేట్, జూన్ 20 (విజయ క్రాంతి): రేషన్ కార్డు జారీలో ఎటువంటి జాప్యం లేకుండా అర్హులైన వారికి వెంటనే జారి చేయాలని చావుని డివిజన్ కార్పొరేటర్ ఏం.ఏ. సలాం షాహిద్ అన్నారు. కార్పొరేటర్ సలాం షాహిద్ మలక్‌పేట్ సర్కిల్-1 పౌరసరఫరాల శాఖ ఏ సి ఎస్ ఓ నర్సింగ్ రావు ని కలిసి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కార్పొ రేటర్ సలాంషాహిద్ మాట్లాడుతూ ఎన్నో నెలల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ రేషన్ కార్డులు జారీ కావడం లేదని అన్నారు. మరి కొంతమందికి ఎంక్వయిరీ ల పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. అర్హులైన వారికి వెంటనే కార్డులు మంజూరు అయ్యేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.