15 August, 2026 | 7:43 AM

వానల హీరోహిణి

25-05-2024 12:42 AM

కరీంనగర్/ రాజన్న సిరిసిల్ల, మే 24 (విజయక్రాంతి): ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడప్పుడూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ‘కొన్నిరోజులు వేసవి తాపం. మరికొన్ని రోజులు చల్లదనం’ అన్నట్లు ప్రస్తుతం తెలంగాణలో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సూర్యుడు ఇక రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ కార్తెలో రోళ్లు పగిలేంత ఎండ ఉంటుందని పెద్దలు చెప్తారు. వేసవిలో ఈ 15 రోజులే అత్యంత వేడిగా ఉండే రోజులు ఇవే. జూన్ మొదటి వారంతో కార్తె ముగుస్తుంది. రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు శుభసూచకంగా భావించి వానకాలం సాగు పనులకు సిద్ధమవుతారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు, ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు వచ్చింది. పత్తి సాగు చేయాలనుకునే రైతులు ఇప్పటికే వేసవి దుక్కులు దున్నిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కూడా మరోవైపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సీజన్‌లో రైతులకు ఎంత మొత్తంలో విత్తనాలు, ఎరువులు కావాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

గత ఏడాది కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్‌లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ ఏడాది అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు తీసుకుం టున్నారు. ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ, పోలీసుశాఖలు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి. మండల స్థాయిలో మండల వ్యవసాయశాఖ అధికారి, ఎస్సై, జోన్ స్థాయిలో సీఐ, వ్యవసాయాధికారులు టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతాయి. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై నిఘా పెడతాయి. తనిఖీల్లో పట్టుబడిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా పనిచేస్తాయి.

యాక్షన్ ప్లాన్ సిద్ధం..

వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో మొత్తం 3,45,070 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని అంచ నా వేశారు. వరి 2,74,500 ఎకరాలు, మొక్కజొన్న 4,500 ఎకరాలు, కందులు 2,000 ఎకరాలు, పత్తి 48,000 ఎకరాలు, మిర్చి వె య్యి ఎకరాల్లో సాగు చేయనున్నట్లు భావిస్తున్నారు. వరి సాగుకు 69,211 క్వింటాళ్లు విత్తనా లు, పత్తి సాగుకు 1.20 లక్షల ప్యాకెట్లు అవసరమని గుర్తించారు. అలాగే 44,353 క్వింటాళ్ల యూరియా, 6,559 క్వింటాళ్ల డీఏపీ, 20,625 ఎన్‌ఆర్కే, 6,433 క్వింటాళ్ల ఎంవోపీ ఎరువులు అవసరమని నిర్ధారణకు వచ్చింది. అలాగే  సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 2,35,866 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వరి 1,82,000 ఎకరాలు, 50 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని భావిస్తున్నారు. అందుకు అనుగణంగా వ్యవ సాయశాఖ అధికారులు ఎరువులు, విత్తనాలు సమకూర్చే పనిలో ఉన్నారు.