15 August, 2026 | 6:44 AM

వచ్చే మూడు రోజులు అక్కడక్కడ వానలు!

25-05-2024 12:42 AM

హైదరాబాద్, మే 24 ( విజయక్రాంతి) : వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శక్రవారం హనుమకొండ జిల్లా వేలేరులో 66.8 మి.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,  జగిత్యాల జిల్లా పూడూర్‌లో అత్యల్పంగా 21.6 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్,  మెహదీ పట్నం 16 మి.్లమీ వర్షపాతం రికార్డయింది. మేడ్చల్ జిల్లా అల్లాపూర్, మూసాపేటలో 40.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా కాప్రా సర్కిల్ 1లో 21.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.