calender_icon.png 13 November, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమ్మయ్యా వచ్చేసింది!

11-10-2024 12:00:00 AM

నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి గురువారం ‘హమ్మయ్యా‘ అనే పాట సెకెండ్ సింగిల్‌గా విడుదలైంది. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, శ్రీ హర్ష ఈమాని లిరిక్స్ రాశారు.