యోనెక్స్ సన్‌రైజ్ ర్యాంకింగ్ టోర్నీ
- గచ్చిబౌలిలో ఘనంగా ముగింపు
- హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మే 29 నుంచి నిర్వహించిన యోనెక్స్ సన్‌రైజ్ -ఆల్ ఇండియా సబ్ జూనియర్ (అండర్-15, అండర్-17) ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి 3,600 మందికి పైగా యువ షట్లర్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య సింగ్ నేగి ఛాంపియన్‌గా నిలవగా, బాలికల సింగిల్స్‌లో రాజస్థాన్‌కు చెందిన అన్వి రాథోర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన హంసిని రన్నరప్‌గా నిలి చి ప్రశంసలు అందుకుంది. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో అవని విజేతగా నిలి చింది. బాలుర డబుల్స్‌లో తమిళనాడుకు చెం దిన తాబిన్ అనుఫ్ అహ్మద్ ఎం.ఎఫ్ తెలంగాణకు చెందిన శ్రీచేతన్ శౌర్య శామల జోడీ విజేతగా నిలిచింది.
బాలికల డబుల్స్‌లో కేరళకు చెందిన అలెక్సియా ఎల్సా అలెగ్జాండర్, తమిళనాడుకు చెందిన జయ సప్తశ్రీ ఎం జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మిజోరంకు చెందిన లియాన్‌సిం గ్‌పియా నాగాలాండ్‌కు చెందిన కిమ్కిమ్ ఖోంగ్‌సై జోడీ ఛాంపియన్‌గా అవతరించింది. ముగింపు కార్యక్రమానికి మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై విజేతలకు బహుమతు లు అందజేశారు.
భారత బ్యాడ్మింటన్ అభివృద్ధిలో జాతీయ ప్రధాన కోచ్ డా. పుల్లెల గోపీచంద్ పాత్ర అపూర్వమని కొనియాడారు. బ్యాట్ ఉపాధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ టోర్నీలో పాల్గొన్న యువ క్రీడాకారుల ప్రతిభను అభినందించారు. విజేతలు, రన్నరప్ క్రీడాకారులను అభినందించిన వి చాముండేశ్వరి నాథ్ యువ క్రీడాకారుల విజయాల్లో కోచ్లు, తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ యు.వి.ఎన్. బాబు, బాయ్ కన్వీనర్ ఉమర్ రషీద్, బ్యాట్ ఉపాధ్యక్షులు వి. చాముండేశ్వరి నాథ్, బ్యాట్ సలహాదారు కొసరాజు లక్ష్మణ్, కోశాధికారి కె. వంశీధర్, బ్యాట్ సభ్యులు శ్రీనివాసరావు, మీడియా కోఆర్డినేటర్ రమణా రెడ్డి, స్పాన్సర్ రాజిరెడ్డి, గ్లోబల్ సొల్యూషన్స్ ప్రతినిధి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.






