calender_icon.png 8 November, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవాసాల మధ్య ఉన్న వైన్ షాప్ ను తొలగించండి

08-11-2025 08:04:30 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని గాంధీ రోడ్లోని జనవాసాలు, బట్టషాపుల మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని కాలనీవాసులు, వస్త్ర వ్యాపారులు కోరారు. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ జిల్లా శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. గతంలోనే తామంతా వ్యతిరేకించినప్పటికి రెండు సంవత్సరాలు వైన్ షాపునకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని అబ్కారి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా తొలగించాలని కాలనివాసులు, వస్త్ర వ్యాపారులు కోరారు.