అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు... సవతి తల్లి విగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు
వావిలాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
పటాన్ చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టించింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, సవతి తల్లి విగ్రహం అని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పార్టీ ఆదేశాల మేరకు జిన్నారం మండలం వావిలాల గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పాలభిషేకం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. బంగారు ఆభరణాలతో నిండుగా కనిపించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసిపోయిన తల్లిగా ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని అన్నారు. సచివాలయంలో ప్రతిష్టించింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని సవతి తల్లి విగ్రహం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలకున్నవారు ఆనవాలు లేకుండా పోయారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, యువ నాయకుడు మాణిక్ యాదవ్, మాజీ సర్పంచ్ లు రవీందర్, శివరాజ్, జనార్దన్, నాయకులు నరేందర్, సురేందర్ రెడ్డి, సతీష్, సింహారెడ్డి, ఆంజనేయులు, గణేష్, భీమ్ రావు, ఖదీర్, కుమ్మరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






