7 May, 2026 | 7:36 AM

ఆన్లైన్ ద్వారా భద్రాద్రి రామయ్య ముక్కోటి ఉత్సవాల టికెట్లు

10-12-2024 06:35 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచల క్షేత్రము నందు డిసెంబర్ 31 నుండి ప్రారంభము కానున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవములను అత్యంత వైభవముగా నిర్వహించడానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. ఉత్సవములలో భాగంగా జనవరి 10వ తేదీ ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు జరిగే శ్రీస్వామి వారి "ఉత్తర ద్వార దర్శనము"ను దర్శించగోరు భక్తుల సౌకర్యార్థమై ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు పొందుటకు ముందస్తుగా అవకాశము కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ద్వారా దర్శనమును దర్శించగోరు భక్తులు, 2000, 1000, 500, 250 రూపాయలు విలువ గల సెక్టార్ టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యక్షముగా ఉత్తర ద్వార దర్శనమునకు హాజరు కాలేని భక్తుల సౌకర్యార్థమై పరోక్ష సేవలు రూ॥2,000/-లు, రూ॥1,000/-లను https://bhadradritemple.telangana.gov.in. డిసెంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల నుండి బుకింగ్ సదుపాయము కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ నందు టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు డిసెంబర్ 25వ తేదీ నుండి జనవరి 10వ తేదీ సాయంత్రం 6:00 వరకు దేవస్థాన తానీషా కళ్యాణ మండపం కార్యాలయం నందు గల సిఆర్ఓ కార్యాలయం వద్ద ఒరిజినల్ టిక్కెట్లను పొందవచ్చునని తెలిపారు. కావున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఈవో రమాదేవి కోరారు.