calender_icon.png 22 August, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలను గెలిపించే బాధ్యత మాది

22-08-2025 12:10:15 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అద్దంకి దయాకర్

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 21 (విజయక్రాంతి): రానున్న ఎన్నికల్లో కార్యకర్తలను సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా గెలిపించే బాధ్యత తమదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అద్దంకి దయాకర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నమని తెలిపారు.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.యూరియా పై కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలనే బతనం చేస్తున్నారని పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు..

యూరియా సరఫరా కేంద్రం పరిధిలోకి వస్తుందని కానీ కేటీఆర్ బిజెపి పై ఎలాంటి ఆరోపణలు చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బధనం చేస్తున్నారని నిన్న మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికే సపోర్ట్ చేస్తా అన్న చెందాన మాట్లాడారని తెలిపారు.

అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ చైతన్యానికి ప్రతీక అని అన్నారు.పిసిసి పదవుల కోసం తీసుకున్న అప్లికేషన్లలో రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల జిల్లా పరిధిలో సుమారు 1700 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.. రానున్న రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే ప్రతి ఎన్నికల్లో వారికి గెలుపులో మేము భాగస్వామ్యం అయితామనిఅన్నారు.