22-08-2025 12:08:13 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు, ఆగస్టు21(విజయక్రాంతి):ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణమునకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.అధికారులతో కలిసి సందర్శించారుఈ సందర్భంగా మార్కెట్ గురించి అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
అనంతరం బండారుపల్లిలోని జిల్లా పశు వైద్యశాఖ కార్యాలయ ఆవరణమును కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఒకే మార్కెట్ ఉన్నందున, జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయ ఆవరణంలో కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.