22-08-2025 12:10:34 AM
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు పెరుగుతున్నాయని, ఇందులో ఎస్సీ యువతకు ఎక్కువ సబ్సిడీలు కల్పించడం వల్ల వారికి వ్యాపారం చేయడం సులభమవుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ప్రధాని ముద్రా యోజన ( పిఎంఎం వై) పథకం ద్వారా వడ్డీ లేకుండా 20 లక్షల రూపాయల వరకు రుణాలు లభ్యమవుతున్నాయని తెలిపారు. వరంగల్లో ఇన్నోవేషన్ కోసం అవసరమైన ఇంక్యుబేషన్ సెంటర్ లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. వరంగల్ లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.