31 March, 2026 | 8:59 AM

ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యమే

24-09-2024 12:17 AM

బీసీ రిజర్వేషన్లపై కమిషన్ మాజీ చైర్మన్ వ్యాఖ్య

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం సాధ్యమవుతుందని జాతీ య బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్ప న, కులగణన అంశాలపై బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రవి చంద్ర, ఎమ్మెల్సీలు రాజు, రమణతోపాటు పలువురు నేతలు సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో సమావేశమై చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన సమగ్ర కులగణన, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కల్పన కోసం బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు.