calender_icon.png 26 January, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు రోజులు భారీ వర్షాలు

24-09-2024 12:14:38 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పశ్చిమ బంగాళాఖా తం, మయన్మార్ దక్షిణ తీరంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నల్లగొండ, సూర్యాపేట, మంచిర్యాల, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.