calender_icon.png 6 February, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యా న్సర్‌ను జయించడం సాధ్యమే

06-02-2026 01:55:48 AM

  1. వ్యాధి పట్ల భయం వీడండి  

రెనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

ఖైరతాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి) :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం నగరంలో 300 బైక్‌లతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. ‘క్యాన్సర్‌ను  జయించడం సాధ్యమే.. భయం వీడండి.. అవగాహనే మీ రక్షణ కవచం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, క్రమమైన స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం. ఈ బైక్ ర్యాలీ రెనోవా హాస్పిటల్‌కు చెందిన అన్ని కేంద్రాల నుంచి ప్రారంభమైం ది. రెనోవా సెంచరీ హాస్పిటల్స్ బంజారా హిల్స్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్  కార్ఖానా, డీడీహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ విద్యానగర్, రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ మలక్‌పేట్ నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీ లు ప్లకార్డులు, నినాదాలతో సందడిగా సా గుతూ హుస్సేన్ సాగర్ వెస్ట్ పార్క్, నెక్లెస్ రోడ్ వద్ద సమ్మేళనం అయ్యాయి.

ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా త్రినాథ్ నరుకుల్లా , కమాండెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తెలంగాణ, గౌరవాతిథులుగా కె.శశి శ్రీ, అడిషనల్ డైరెక్టర్ (అడ్మిని స్ట్రేషన్), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డాక్టర్ సాజిదా ఖాన్, డాక్టర్ సాజిదాఖాన్, ఆడియో ఇంజనీర్, సామాజిక నాయకురాలు అండ్ విద్యావేత్త, భారతదేశపు తొలిమహిళా ఆడియో ఇంజనీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రినాథ్ నరుకుల్లా మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. 

ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణ దిశగా నిరంతరం కృషి చేస్తున్న రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కె.శశిశ్రీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో అవగాహన కార్యక్రమాలు కీలకమై న పాత్రపోషిస్తున్నాయన్నారు. మహిళల్లో క్యాన్సర్ వంటి వ్యాధుల విషయంలో ముందస్తు గుర్తిం పు, క్రమమైన స్క్రీనింగ్ పరీక్షలు,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవా ట్లు అనేక ప్రాణాలను రక్షించగలవని తెలిపారు.

మహిళలు భయం, అపోహలను దూరం చేసుకోవాలని, ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల ను సంప్రదించడం అత్యంత అవసరమని సూచించారు. డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్,హైపెక్ సర్జన్ మాట్లాడుతూ రెనోవా గ్రూప్ ఎల్లప్పుడూ సామాన్యులకు సైతం అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి కృషిచేస్తోం దని, ఆరోగ్యకరమైన జీవనశైలే క్యాన్సర్‌కు ఉత్త మ వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇండీవర్ కిరణ్, మెడికల్ డైరెక్టర్, డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ పీ సత్య దత్తాత్రేయ, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ శ్రీనివాస్ జూ లూరి, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ ,హైపెక్ సర్జన్,

డాక్టర్ ఎల్ యుగంధర్‌శర్మ, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డా.సయ్యద్ అక్రమ్ కే, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్, రేడియేషన్ అంకాలజిస్ట్, జనార్దన్, రెనోవా గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, రవీంద్రనాథ్ గరగ, సీఓఓ రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ మహదేవ్, డా.వారిస్, రామసుబ్బారెడ్డి, శ్రీవల్లిలతో పాటు పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, అధికారు లు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.